భోజనాన్ని తగ్గించండి.. బరువు కూడా తగ్గండి..మితాహారంతో మూడ్ బాగుంటుందట..

- March 07, 2017 , by Maagulf
భోజనాన్ని తగ్గించండి.. బరువు కూడా తగ్గండి..మితాహారంతో మూడ్ బాగుంటుందట..

మాన‌వ‌జీవితంలో ప్ర‌తి ఒక్కమగాడికి లైంగిక సామ‌ర్థ్యం చాలా ముఖ్యం. లైంగీక జీవ‌నంలో సంతృప్తి లేకుంటే జీవితంలో కలతలు ఏర్పడతాయి. ఈ లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. మితాహారం తిన‌డం వల్ల మూడ్ బాగుంటుందని, టెన్షన్ తగ్గుతుందని, దీని ఫలితంగా సంసార జీవితం సుఖమయంగా సాగుతుందని నిపుణులు సలహాలిస్తున్నారు. 
 
ఇందుకోసం 218 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ఆహారపు అలవాట్లను రెండేళ్ల పాటు లూసియానాలోని పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించి వాళ్లలో ఒక గ్రూపుకి భోజనాన్ని క్రమంగా 25 శాతం తగ్గించారు. మరో గ్రూపు వాళ్లకు మాత్రం మామూలు భోజనమే పెట్టించారు. 
 
వాళ్లలో భోజనం తక్కువగా తీసుకున్నవాళ్లు తమ సంసార జీవితాన్ని గతంలో కంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారని...మిగిలినవాళ్లు మాత్రం సాధారణంగానే సెక్స్‌లో పాల్గొంటున్నట్టు తెలిపారు. భోజనాలు తగ్గించినవాళ్లకు బరువు కూడా తగ్గి నిద్ర బాగా పట్టినట్లు తెలిపారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదని, దాంతో సంసార జీవితంపై మొగ్గు చూపడంలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com