మారుతి చేతులమీదుగా 'లంక' విడుదలైన ట్రైలర్
- March 14, 2017
సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నామన శంకర్రావు-సుందరిలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను సంచలన దర్శకులు మారుతి విడుదల చేశారు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు మాట్లాడుతూ.. "వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రాశీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలవడం ఖాయం. స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా పర్టీక్యూలర్ గా ఉండే రాశీ గారు మా దర్శకుడు శ్రీముని చెప్పిన కథ నచ్చి ఈ చిత్రంలో నటించడం మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. షూటింగ్ పూర్తయ్యింది ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "లంక" ఆడియోను ఈనెలాఖరుకు విడుదల చేసి వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.
రాశి, సాయి రోనక్, ఐనా సాహ, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు, రాజేష్, సత్య, సుదర్శన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్, డ్యాన్స్: స్వర్ణ, కళ: హరివర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: వి.రవికుమార్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.రవిబాబు, పి.ఆర్.ఓ: వంశీశేఖర్, నిర్మాతలు: నామన దినేష్-నామన విష్ణు కుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీముని!
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







