365 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- May 13, 2019
దుబాయ్ పోలీసులు 365 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 278 మిలియన్ దిర్హామ్‌లుగా అంచనా వేస్తున్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ పట్టివేత ఘటనగా భావిస్తున్నారు పోలీసులు. మొత్తం 16 మంది ఆసియాకి చెందిన వ్యక్తుల్ని ఈ ఘటనలో అనుమానితులుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు వాహనం స్పేర్ పార్ట్స్‌లో డ్రగ్స్‌ని అమర్చి స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 268 కిలోల హెరాయిన్, 9.6 కిలోల క్రిస్టల్ మెత్, 1 కిలో హాషిష్‌ని పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, నిందితులు విదేశాలకు చెందినవారిగా గుర్తించినట్లు చెప్పారు. మిగతా నిందితుల్ని అరెస్టు చేసే క్రమంలో వివిధ దేశాల సహాయ సహకారాల్ని తీసుకుంటామనీ వివరించారాయన.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!