చేహరే - ఫస్ట్ లుక్ విడుదల
- May 13, 2019
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి 'చేహరే' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రూమీ జాఫ్రీ దర్శకత్వంలో, మోషన్ పిక్చర్స్ అండ్ సితార ఎంటర్ టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మిస్తున్నాయి. ఇమ్రాన్ హష్మీ, కృతి కర్బందా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెల్లటి జుట్టు, తెల్ల గెడ్డం, ఆ గెడ్డాన్ని ముడివేయడం, కళ్ళజోడు, తలకి మంకీ క్యాప్ లాంటి టోపీతో ఆకట్టుకునేలా ఉంది అమితాబ్ లుక్..
మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబాయిలో స్టార్ట్ అయ్యింది. 'బిగ్ బీతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది, 46 ఏళ్ళ క్రితం మా నానమ్మ జంజీర్ సినిమాలో అమితాబ్ గారికి తల్లిగా నటించారు' అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ హష్మీ. 2020 ఫిబ్రవరి 21న చేహరే విడుదల కానుంది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్