దుబాయ్:సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ ఖరీదు Dh100కి మించొద్దు..ప్రైవేట్ ఆస్పత్రులకు సూచన
- October 28, 2020
దుబాయ్:సీజనల్ ఫ్లూ నివారణకు ఇచ్చే వ్యాక్సిన్ కు 100 దిర్హామ్ లకు మించి వసూలు చేయకూడని దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ లను ఆదేశించారు. శీతాకాలంలో ఫ్లూ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో..వ్యాధుల నివారణకు యూఏఈ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..యూఏఈ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నా..ప్రవాసీయులకు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇందుకు 40 దిర్హామ్ ల నుంచి 120 దిర్హామ్ ల వరకు చార్జ్ చేస్తున్నారు. అయితే..ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాల్సిన అవసం ఉంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీపై ఫోకస్ చేశారు. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ వంద దిర్హామ్ లకు మించి చార్జ్ వసూలు చేయొద్దని ఆదేశించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!