దుబాయ్:సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ ఖరీదు Dh100కి మించొద్దు..ప్రైవేట్ ఆస్పత్రులకు సూచన

- October 28, 2020 , by Maagulf
దుబాయ్:సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ ఖరీదు Dh100కి మించొద్దు..ప్రైవేట్ ఆస్పత్రులకు సూచన

దుబాయ్:సీజనల్ ఫ్లూ నివారణకు ఇచ్చే వ్యాక్సిన్ కు 100 దిర్హామ్ లకు మించి వసూలు చేయకూడని దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ లను ఆదేశించారు. శీతాకాలంలో ఫ్లూ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో..వ్యాధుల నివారణకు యూఏఈ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే..యూఏఈ పౌరులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నా..ప్రవాసీయులకు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇందుకు 40 దిర్హామ్ ల నుంచి 120 దిర్హామ్ ల వరకు చార్జ్ చేస్తున్నారు. అయితే..ప్రస్తుత కోవిడ్ 19 పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందాల్సిన అవసం ఉంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీపై ఫోకస్ చేశారు.  వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ వంద దిర్హామ్ లకు మించి చార్జ్ వసూలు చేయొద్దని ఆదేశించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com