కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా..విదేశీ ప్రయాణాల్లో పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి-యూఏఈ
- November 25, 2020
యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నా...ఇతర దేశాల నుంచి యూఏఈకి తిరిగి వచ్చే వారికైనా పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. ఈ మార్గదర్శకాలు గతంలోనే జారీ చేసినా...కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నేపథ్యంలో గత మార్గనిర్దేశకాల్లో సవరణలు చేసింది. కింగ్డమ్ పరిధిలో రెండు వర్గాలుగా వ్యాక్సినేషన్ జరిగిన విషయం తెలిసిందే. చైనా బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ సినోఫార్మ్ ను తమ దేశంలో క్లినికల్ ట్రయల్స్ కి అంగీకరించటంతో కొందరు వాలంటీర్లకు జులై నుంచే వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇది మొదటి వర్గం. ఇక నేషనల్ వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ కింద ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర కీలక అధికారులకు కూడా వ్యాక్సిన్ డోసులు వేస్తున్నారు. ఇది రెండో వర్గం. సినోఫార్మ్ కు అత్యవసర అనుమతులు ఇచ్చిన తర్వాత రెండో వర్గంలోని వారికి వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వస్తున్నారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రానా వారి విదేశీ ప్రయాణ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని యూఏఈ స్పష్టం చేసింది. తొలి విడత డోసు తీసుకున్న వారు అబుదాబి వచ్చేందుకు ఎలాంటి రిపోర్ట్ లు అవసరం లేకున్నా...విదేశాలకు వెళ్లాలంటే మాత్రం పీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల నుంచి కింగ్డమ్ కు వచ్చే వారు...పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ వెంట తీసుకురావాలని, అలాగే యూఏఈలో అడుగు పెట్టిన నాటి నుంచి నాలుగో రోజున, ఎనిమిదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లక్నోలో ఫైనాన్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!







