ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత
- December 01, 2020
హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుండి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆయన అపోల ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి విషయం తెలిసి పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
1999, 2004లో సీపీఎం తరపున విజయం సాధించిన ఆయన 2013లో టీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భువనగరి ఎంపీ స్థానానికి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి జానారెడ్డిపై పోటీ చేసిన నర్సింహయ్య ఘన విజయం సాధించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!