6.5 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్..ఇవాళే హైదరాబాద్‌కు
- January 12, 2021
భారత్: ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. తొలుత ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్‌కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.. తెలంగాణ రాష్ట్రంలోనూ నెల 16 నుంచే కరోనా వ్యాక్సినేషన్ మొదలకానుంది.. ఇప్పటికే ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సీరం రూపొందించిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ సమర్థవంతమైన కోవిడ్ వ్యాక్సిన్లుగా ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. ఇక, పంపిణీ ప్రక్రియ కూడా మొదలైంది... ఇప్పటికే పుణె నుంచి వ్యాక్సిన్లతో ట్రక్కులు బయల్దేరాయి.. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చనున్నారు సిబ్బంది.
ఈ వ్యాక్సిన్లనే తెలంగాణలో అందించాలని నిర్ణయించినట్లుగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. ముందుగా ఆశ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా ఇవాళ తెలంగాణకు 6.5 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ రానుంది... ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా.. తెలంగాణలో 1,213 సెంటర్లలో వ్యాక్సినేషన్ చేయనున్నారు. పుణె నుంచి 9 ప్రత్యేక విమానాల ద్వారా ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, గౌహతి, సిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పాట్నా, బెంగళూరు, లక్నో, ఛండీగడ్‌కు మొత్తంగా 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్ రవాణాకు సిద్ధమైంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







