గల్ఫ్ లో ఎగవేసిన జీతాలు ఇలా పొందవచ్చు !
- April 25, 2021
తెలంగాణ: కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) ఇప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో కోరారు.
'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలి) అనే నినాదంతో కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన ఉద్యమంలో భాగంగా తాము వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి హక్కుల గురించి అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్వదేశ్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో విదేశీ వలసలు ఎక్కువగా ఉన్న జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా డేటా సేకరణ చేస్తున్నామని ఆయన తెలిపారు.
విదేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాలు, న్యాయ సహాయ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల సహకారంతో విదేశీ లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన 'లీగల్ ఎయిడ్' (న్యాయ సహాయం) పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నామని స్వదేశ్ తెలిపారు.గల్ఫ్ తదితర దేశాలలోని కంపెనీల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి బాధితులు తమ వివరాలను ప్రవాసి మిత్ర హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ +91 62817 63686 కు పంపించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!