సమ్మర్ సెలవుల్లో విదేశాలకు వెళ్లే వారికి కొత్త సూచనలు
- July 01, 2021
దుబాయ్: సమ్మర్ సెలవుల్లో విదేశీ ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారా? అయితే..ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలంటూ దుబాయ్ సుప్రీం కమిటీ పౌరులు, ప్రజలకు సూచించింది. సెకండ్ డోసు వేసుకున్న 14 రోజుల తర్వాతే విదేశీ ప్రయాణాలు చేయటం మంచిదని అభిప్రాయపడింది. రెండో డోసు వేసుకున్న 14 రోజుల తర్వాతే శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తి స్థాయిలో పెరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొంది. వీలైనంత వరకు విదేశాలకు వెళ్లకపోవటమే మంచిదని అభిప్రాయపడుతూనే ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం కోవిడ్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని సూచించింది. ముఖ్యంగా కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను విస్మరించాలని కోరింది. అలాగే ఆయా దేశాల్లో అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. పబ్లిక్ ప్రాంతాలు, సందర్శన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించటంతో పాటు ఫేస్ మాస్క్ విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించింది.
తాజా వార్తలు
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా