గణపతి సచ్చిదానంద బయోపిక్ ప్రకటించిన బండ్ల గణేష్
- October 24, 2021
హైదరాబాద్: ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు గణేష్ ప్రకటించారు. సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామితో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు గణేశ్. నటుడిగా పేరు సంపాదించిన తర్వాత బండ్ల గణేష్ నిర్మాణ రంగంలోకి దిగాడు. ‘తీన్ మార్, ఆంజనేయులు, గబ్బర్ సింగ్, బాద్ షా, టెంపర్’ వంటి సినిమాలను నిర్మించాడు. ఆ తర్వాత కొంత కాలం రాజకీయ ప్రయాణం కూడా సాగించాడు. అయితే అది సరిగ్గా సాగకపోవడంతో మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు. గతేడాద ‘సరిలేరు నీకెవ్వరు’లో చిన్న పాత్రతో మళ్ళీ నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తానని అంటున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం సచ్చిదానంద స్వామి బయోపిక్ ప్రకటనను చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ‘అప్పాజీ జీవిత చరిత్ర సినిమా చేసి తీరతా. ఆయన పాదాల సాక్షిగా అనుమతించారు. ఎవరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ స్వామీజీతో దిగిన ఫోటోను గణేష్ ట్వీట్ చేశాడు. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? సచ్చిదానంద స్వామి పాత్ర ఎవరు పోషిస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను బండ్ల గణేష్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







