ఒమన్ రోడ్లపై ఏడాదిలో 200 మహిళా టాక్సీలు
- February 22, 2022
ఒమన్: మహిళలు, కుటుంబాలకు ప్రత్యేకంగా ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాన్ని అందించడం కోసం ఏడాదిలోపు 200 మంది మహిళా ట్యాక్సీలను ఏర్పాటు చేయాలని ఒమన్ లక్ష్యంగా పెట్టుకుంది. టాక్సీక్యాబ్ సర్వీస్ Otaxi లో ప్రస్తుతం 20 మహిళలు మాత్రమే క్యాబ్‌లను నడుపుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రత్యేక మహిళ క్యాబ్ సర్వీస్‌లను ఆపరేట్ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మహిళ టాక్సీలను మస్కట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రాబోయే మూడు నెలల్లో 50 మహిళ టాక్సీలు నడుపుతామని, ఏడాదిలో 200 మంది మహిళా డ్రైవర్లను నియమించుకుంటామని Otaxi సీఈఓ హరిత్ అల్ మెక్బాలీ చెప్పారు. ప్రస్తుతం తమ సేవలు మస్కట్‌కు మాత్రమే పరిమితమని, త్వరలోనే ఇతర గవర్నరేట్లకు విస్తరిస్తామని ఆయన తెలిపారు. మహిళలు నడిపే టాక్సీలకు కొన్ని అదనపు భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేశామని, వారు ప్రయాణించే మార్గాలను ట్రాక్ చేయడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!