యూఏఈలో ఏపీ దివంగత మంత్రి మేకపాటి కి ఘన నివాళి

- February 27, 2022 , by Maagulf
యూఏఈలో ఏపీ దివంగత మంత్రి మేకపాటి కి ఘన నివాళి

యూఏఈ: ఏపీ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య మరియు ఐటీ శాఖ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల షార్జా లో APNRTS వారి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో దుబాయ్ లోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా డా.అమన్ పూరి,జుల్ఫీ రావడ్జీ(ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు),APNRTS కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ఔన్నత్యాన్ని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి లోకి తీసుకొని వెళ్లేందుకు ఆయన  చేసిన ప్రయత్నాల్ని గుర్తు చేసుకుంటూ బాధాతప్త హృదయాలతో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంకు APNRTS కో-ఆర్డినేటర్లు బ్రహ్మానంద రెడ్డి,శ్యామ్ సురేంద్ర,అక్రమ్ దగ్గర వుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెంకట అప్పా రెడ్డి, ఉదయ భాస్కర రెడ్డి,వెంకట రమణ,వెంకట రాజు,ఈశ్వర నాయుడు,సంజీవ్ ,సునీల్,యశ్వంత్,సుదర్శన్,జాఫర్ అలీ,అనురాధ,ఎస్.వేణు తదితరులు విచ్చేసి తమ సంతాపం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com