బహ్రెయిన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన షూరా కౌన్సిల్ సెక్రటరీ జనరల్

- October 14, 2022 , by Maagulf
బహ్రెయిన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన షూరా కౌన్సిల్ సెక్రటరీ జనరల్

మనామా: అరేబియా గల్ఫ్‌లో అటువంటి పదవిని నిర్వహించిన మొదటి మహిళగా తనను నియమిస్తూ డిక్రీ జారీ చేసినందుకు షురా కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కరీమా మహ్మద్ అల్ అబ్బాస్సీ తన మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు కృతజ్ఞతలు తెలిపారు. HM  కింగ్ హయాంలో బహ్రెయిన్ మహిళల ప్రధాన్యత పెరిగిందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య, శాసనపరమైన విజయాలను సాధించడానికి రాయల్ ట్రస్ట్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. అల్ అబ్బాస్సీ హెచ్‌ఎం రాజు దార్శనికతలను, ఆకాంక్షలను సాధించడంలో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ మహిళా సాధికారత, అభ్యున్నతిలో కీలక పాత్ర పొషించిన మాజీ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ (SCW) ప్రెసిడెంట్‌ రాయల్ హైనెస్ ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫా( HM రాజు భార్య)కి నివాళులర్పించారు. అలాగే షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ జనరల్ సెక్రటేరియట్‌కు అందించిన మద్దతును కూడా ఆమె మెచ్చుకున్నారు. మానవ వనరులను ప్రోత్సహించడానికి అతను కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com