అబుధాబిలో మద్యం తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలు
- October 14, 2022
అబుధాబి: మద్యం (ఆల్కహాలిక్ డ్రింక్స్) తయారీ, విక్రయాలపై కొత్త నిబంధనలను డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (DCT) విడుదల చేసింది. వీటిని అమలు చేసేందుకు మద్యం తయారీ దారులు, రిటైల్ దుకాణాలు, పంపిణీ సంస్థలకు ఆరు నెలల సమయాన్ని అథారిటీ ఇచ్చింది. నిబంధనలు పాటించని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీ హెచ్చరించింది. డీసీటీ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కనీస ఆల్కహాలిక్ స్ట్రెంత్ తప్పనిసరిగా 0.5 శాతం ఉండాలి. వైన్లో వెనిగర్ రుచి లేదా వాసన లేకుండా ఉండాలి. అయితే బీర్లో పంచదార పాకం మినహా ఎలాంటి కృత్రిమ స్వీటెనర్లు, రుచులు, రంగులు ఉండకూడదు. తగిన శానిటరీ పరిస్థితులకు అనుగుణంగా మద్యాన్ని తయారు చేయాలి. తయారైన మద్యాన్ని శుభ్రమైన కంటైనర్లలో ప్యాక్ చేయాలి. తయరీలో వినియోగించిన పదార్థాలు, ఆరిజిన్, తయారీదారు, షెల్ఫ్ లైఫ్, ఆల్కహాల్ శాతం ఇలా సమస్త సమాచారం తప్పనిసరిగా లేబుల్లపై పేర్కొనబడాలి. వీటితోపాటు ప్యాకేజింగ్, రవాణా, నిల్వ గురించిన అనేక నిబంధనలను డీసీటీ సూచించింది.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..