ఆన్ లైన్ మోసాల పట్ల బి అలర్ట్-సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్
- October 14, 2022
మనమా: ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డిపార్ట్మెంట్ కు చెందిన యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ప్రజలకు సూచించింది. చాలా మంది మోసపూరిత కాల్స్ చేస్తూ ఓటీపీ షేర్ చేయాలని అడుగుతున్నారని సూచించారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) ని ఇతరులకు షేర్ చేయవద్దని సూచించింది.ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల వినియోగదారుల పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకులు కాల్స్, మెసేజ్ ల ద్వారా పాస్ వర్డ్ లు అడగవని...అలా ఎవరైనా అడిగితే అది మోసపూరితమైన కాల్స్ అని గుర్తించాలని అన్నారు. మోసపూరిత కాల్స్ వస్తే హాట్‌లైన్ 992కి కాల్ చేయాలని సైబర్ సెక్యూరిటీ అధికారులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







