ఖతార్‌లో 40% ఉపాధ్యాయులకు వృత్తిపరమైన లైసెన్స్‌లు
- October 26, 2022
దోహా: ఖతార్‌లో దాదాపు 40 శాతం మంది ఉపాధ్యాయులు ప్రొఫెషనల్ లైసెన్స్‌లు పొందారని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.ఉపాధ్యాయులు, పాఠశాల నాయకుల కోసం ప్రొఫెషనల్ లైసెన్సింగ్ సిస్టమ్‌తో సహా అనేక సిస్టమ్‌లు, ప్రోగ్రామ్‌ల అప్లికేషన్ ద్వారా ఉపాధ్యాయుల పనితీరు స్థాయిని, విద్యార్థుల సాధనను పెంచడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉందని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖలోని ఉపాధ్యాయ వ్యవహారాల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ జెసైమానీ తెలిపారు. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన లైసెన్స్‌లు జాతీయ వృత్తిని నిర్ధారిస్తూ, జాగ్రత్తగా ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత మంజూరు చేయబడుతుందన్నారు. ప్రమాణాలు, వృత్తిపరమైన లైసెన్స్, ఉద్యోగ ప్రమోషన్ లకు ఈ లైసెన్సులు ప్రతిపాదికగా నిలుస్తాయన్నారు. ఉపాధ్యాయ వ్యవహారాల విభాగం సహకారంతో విద్యా శిక్షణ, అభివృద్ధి కేంద్రం వరుసగా ఏడవ సంవత్సరం నిర్వహించిన “తమ్‌కీన్” శిక్షణా కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ పని చేస్తోందని అల్ జెసైమానీ సూచించారు. బోధన అనుభవం లేని ఖతార్ విశ్వవిద్యాలయం, స్థానిక విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఉపాధ్యాయులు కావడానికి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉందని, వారికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలను అందజేస్తున్నట్లు అల్ జెసైమానీ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







