‘స్వాతిముత్యం’ సెన్సిటివ్ కాన్సెప్ట్ కానీ.! ‘అక్కడ’ ఫ్యామిలీ ఎట్రాక్షన్ బాస్.!

- October 26, 2022 , by Maagulf
‘స్వాతిముత్యం’ సెన్సిటివ్ కాన్సెప్ట్ కానీ.! ‘అక్కడ’ ఫ్యామిలీ ఎట్రాక్షన్ బాస్.!

బెల్లంకొండ సోదరుడు గణేష్ హీరోగా డెబ్యూ చేసిన మూవీ ‘స్వాతముత్యం’. ఇటీవలే ధియేటర్‌లో సందడి చేసిన ఈ సినిమా రెండు వారాలు తిరక్కుండానే ఓటీటీ ప్రేక్షకుల ముందుకూ వచ్చేసింది.
దీపావళి సందర్భంగా ఓటీటీలో రిలీజైన ‘స్వాతిముత్యం’ ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా అలరించింది. నిజానికి కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే, ఈ సినిమా కథ చాలా సెన్సిటివ్ కాన్సెప్ట్. కరెక్టుగా చెప్పాలంటే యూత్ ఎట్రాక్టివ్ కంటెంట్.
ఆ కంటెంట్‌కి ఫ్యామిలీ డ్రామాని యాడ్ చేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేసంగా ఆకట్టుకుంది. టార్గెట్ తప్పిందనే కానీ, ఫ్యామిలీ డ్రామా ఓవర్ డోస్ కావడంతో, ఫెస్టివల్‌కి ఇంటిల్లిపాదీ కూర్చొని హాయిగా పిండి వంటలు తింటూ ఆస్వాదించగల ఎంటర్‌టైన్‌మెంట్ అందించిందీ సినిమా.
అయితే, ఎంచుకున్న కంటెంట్ ఏంటీ.? చెప్పిన విధానమేంటీ.? అంటూ కొందరు విమర్శకులు ఈ సినిమాని విమర్శిస్తున్నారనుకోండి. ఏది ఏమైతేనేం, ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పర్‌ఫెక్ట్ యాప్ట్.. అంటూ ఓటీటీయన్లు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారీ సినిమాని.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com