విదేశీయులకు ఇండోనేషియా తీపి కబురు!
- November 29, 2022
జకార్తా: విదేశీయులకు ఇండోనేషియా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.కరోనా సంక్షోభం కారణంగా నిలిపివేసిన మల్టీపుల్ ఎంట్రీ వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇక మల్టీపుల్ ఎంట్రీ వీసాతో వ్యాపారవేత్తలు, విదేశీ పర్యాటకులు మళ్లీ మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోకుండా ఏడాదిలో పలుమార్లు ఇండోనేషియా వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలాగే విజిటర్ ఆ దేశంలో 60 రోజులు బస చేయవచ్చు. ఇకపోతే ఈ వీసాదారులు ఇండోనేషియాలోని రియావు దీవుల ప్రావిన్స్‌లో ప్రవేశించడానికి, అక్కడి నుండి స్వదేశానికి వెళ్లడానికి కూడా అనుమతించబడతారు. అలాగే సందర్శకులు బస సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శించడానికి సైతం ఎలాంటి రుసుము ఉండదు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్