మహేష్‌ని ఇండియన్ జేమ్స్ బాండ్లా మార్చేయనున్న జక్కన్న.!
- November 30, 2022
మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇది. ‘బాహుబలి’తో ఓ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నరాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’తో ఆ స్థాయిని మరిన్ని రెట్లు పెంచుకున్నాడు.
ఆ తర్వాత చేయబోయే సినిమా అంతకు మించి అనేలా వుండాలి కదా. అందుకే, గ్లోబ్ ట్రాటింగ్ అనే హై అండ్ నేపథ్యమున్న కథాంశాన్ని మహేష్ సినిమా కోసం ఎంచుకున్నాడు రాజమౌళి.
గ్లోబ్ ట్రాటింగ్.. అంటూ ప్రపంచాన్ని చుట్టి రావడం.. అయితే, ఈ సినిమాలో మహేష్ చేసే సాహసాలు చూస్తూ జేమ్స్ బాండ్ సినిమాలను తలపిస్తాయనీ అంటున్నారు. అలాగే, విజువల్గానూ జేమ్స్ బాండ్ సినిమాల్లోని రిచ్‌నెస్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట రాజమౌళి. అండర్ కవర్ కాప్‌గా మహేష్ కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా వున్న మహేష్ బాబు, తదుపరి రాజమౌళి సినిమా కోసం ఎలాంటి మేకోవర్ కనబరుస్తారో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ లోని అల్ బలాదియా జంక్షన్ మూసివేత..!!
- జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ఒమన్, బెలారస్ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- జాతీయ రైతు బజార్ 13వ ఎడిషన్.. అందరికి ఆహ్వానం..!!
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి