ఇంజనీర్ల వర్క్ పర్మిట్ కోసం కొత్త నిబంధనలు: ఒమన్
- November 30, 2022
మస్కట్: ఇంజనీర్ల వర్క్ పర్మిట్ కోసం ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇంజనీర్ వృత్తిలో చేరేందుకు ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ సిస్టమ్‌ను అమలు చేయడం ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని సంస్థలకు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. వర్కింగ్ ఇంజనీర్లందరూ ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మంత్రిత్వ శాఖ నుండి వర్క్ పర్మిట్‌ను పొందడం లేదా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి అని తెలిపింది. ఫిబ్రవరి నాటికి వర్క్ పర్మిట్లను జారీ చేయడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రొఫెషనల్ అక్రిడిటేషన్ తప్పనిసరి చేసినట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘోర ప్రమాదం.. బస్సులోని 18 మంది ప్రయాణికులు మృతి..
- వాట్సాప్‌లో ఇన్స్టాగ్రామ్ ‘యూజర్ నేమ్’ ఫీచర్..
- ఉచిత బస్సుల పై వెంకయ్య నాయుడు ఫైర్
- మంగళగిరి ఎయిమ్స్ లో త్వరలో ట్రామా సెంటర్: ఎంపీ బాలశౌరి
- అమెరికాలో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా గాంధీజయంతి వేడుకలు
- డా.బంగారి రజనీ ప్రియదర్శినికి టైమ్స్ ఆఫ్ ఇండియా హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్
- ఎస్ఎస్ఆర్ హోటల్స్ కు స్వచ్ఛ ఆంధ్రా అవార్డు..!!
- జ్లీబ్ సమస్యకు వర్కర్స్ సిటీస్ తో చెక్..!!
- BD7,000 విలువైన గోల్డ్ జివెల్లరీ చోరీ..మహిళ అరెస్టు..!!
- కస్టమ్స్ యాప్ ద్వారా కార్లు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వేలం..!!