యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఒమానీ ఖంజర్

- December 03, 2022 , by Maagulf
యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఒమానీ ఖంజర్

మస్కట్: యునెస్కో లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో ఒమన్ సంప్రదాయాలకు చిహ్నమైన అల్-ఖంజర్ స్థానం సంపాందించింది. ఒమన్‌లో జాతీయ, మతపరమైన కార్యక్రమాలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాలలో పురుషులు ధరించే సాంప్రదాయ దుస్తులలో అల్-ఖంజర్ ఒక భాగమని యునెస్కో తెలిపింది. ఒమానీ సంస్కృతి ఇది చిహ్నమని పేర్కొంది. ఒమానీ ఖంజర్ తయారీలో ప్రత్యేక కలప, తోలు, గుడ్డ, వెండితో సహా వివిధ రకాల పదార్థాలను వినియోగిస్తారు. ప్రత్యేకమైన డిజైన్లతో వీటిని ఆకర్షణీయంగా తయారు చేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com