233 మొబైల్స్‌, 25 ల్యాప్‌టాప్‌ల చోరీ: నలుగురి ముఠాపై విచారణ ప్రారంభం

- December 03, 2022 , by Maagulf
233 మొబైల్స్‌, 25 ల్యాప్‌టాప్‌ల చోరీ: నలుగురి ముఠాపై విచారణ ప్రారంభం

యూఏఈ: దుబాయ్ ఫ్రీ జోన్‌లో ఉన్న ఓ షిప్పింగ్ కంపెనీ వేర్‌హౌస్ నుండి 233 మొబైల్ ఫోన్‌లు, 25 ల్యాప్‌టాప్‌లను దొంగిలించినందుకు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నలుగురు జాతీయులపై దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. దొంగిలించబడిన వస్తువులలో ఐఫోన్‌లు, శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లు, మ్యాక్‌బుక్స్ ఉన్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పోలీసుల కథనాల ప్రకారం.. మే 15న కంపెనీ మేనేజర్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. సీఐడీ బృందాన్ని క్రైం స్థలాన్ని పరిశీలించింది. గోదాం పగులగొట్టినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 2 గంటలకు గిడ్డంగి షట్టర్‌ని తెరిచేందుకు నిందితులు యత్నించినట్లు సీసీటీవీ కెమెరాల ఫుటేజీ ద్వారా గుర్తించారు. గంట తర్వాత దొంగిలించిన వస్తువులతో గోదాం నుంచి బయటకు వచ్చిన ముఠా.. ఆ వస్తువులను జీఎంసీ వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి పరారైనట్లు స్పష్టమైంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుల్లో ఒకరిని దుబాయ్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతను నేరాన్ని అంగీకరించడంతోపాటు ఇతర సభ్యుల ఆచూకీని పోలీసులకు అందించాడు. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com