నేడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్

- December 18, 2022 , by Maagulf
నేడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్

దోహా: ఫుట్ బాల్ క్రీడాభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. నెల రోజులుగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. నేడు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఖతార్ లోని లుసైల్ స్టేడియం వేదికగా తుది పోరు జరుగనుంది. ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్, అర్జెంటీనా తలపడనున్నాయి. రెండు టీమ్ లూ వరల్డ్ కప్ లో అద్భుత ఫామ్ కనబరిచాయి. ఫైనల్ లో ఫ్రాన్స్, అర్జెంటీనాలు హోరాహోరీగా తలపడనున్నాయి. స్టార్ ప్లేయర్ మెస్సీపైనే అర్జెంటీనా ఆశలు పెట్టుకుంది.

ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాప్పే అద్భుతంగా రాణిస్తున్నారు. డిపెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, రెండు సార్లు చాంపియన్ గా ఉన్న అర్జెంటీనాల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగనుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కు ఖతార్ లోని లుసైల్ స్టేడియం వేదిక కానుంది. ఈ టోర్నీలో 218 చాంపియన్ ర్యాంక్ అర్జెంటీనా, ఫ్రాన్స్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. దీంతో మ్యాచ్ పోటాపోటీగా సాగే అవకాశం ఉంది.

అర్జెంటీనాను ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన క్యాప్టెన్, ఫుట్ బాల్ మాంత్రికుడు మెస్సీపై ఆ టీమ్ ఆశలు పెట్టుకుంది. అతడి సారథ్యంలో మరోసారి విజేతగా నిలవాలని అర్జెంటీనా టీమ్ ఉవ్విల్లూరుతోంది. ఈ మ్యాచ్ తో మెస్సీ రిటైర్ మెంట్ ప్రకటించడంతో ప్రపంచ కప్ ను ముద్దాడాలన్న కసి అర్జెంటీనాలో కనిపిస్తోంది.

ఇప్పటికే డిపెండింగ్ చాంపియన్ గా ఉన్న ఫ్రాన్స్ కూడా ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. వరుసగా రెండో సారి కప్ కొట్టాలని భావిస్తోంది. అయితే తుది పోరులో ముందుకు స్టార్ డిపెండర్లు రాఫెల్ వరేనా, ఇబ్రహీమా కొనాటే అనారోగ్యంతో బాధపడుతుండటం ఆ జట్టును వేధిస్తోంది. పవర్ ఫుల్ అటాకింగ్ లైనప్ తో ఫ్రాన్స్ జట్టు మంచి దూకుడు మీద ఉంది.

ఆ జట్టులో 23 ఏళ్ల సూపర్ స్టార్ కైల్యన్ ఎంబాప్పీ ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మ్యాచ్ ను మెస్సీ, ఎంబప్పే మధ్య పోరుగా కూడా అభివర్ణిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇద్దరు సూపర్ స్టార్లు ముఖాముఖిగా పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com