హైదరాబాద్ నుంచి గోవాకు విమాన సర్వీసులు ప్రారంభం
- January 05, 2023
హైదరాబాద్: ఈ నూతన సంవత్సరం, ముత్యాల నగరమైన హైదరాబాద్ నుంచి మోపా వద్ద నిర్మించిన న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ విమానం, ఇండిగో 6E 6145 హైదరాబాద్ నుండి 179 మంది ప్రయాణికులతో బీచ్ గమ్యస్థానమైన గోవాకు 07.40 గంటలకు బయలుదేరింది. ఇండిగోతో పాటు, గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ కూడా ఈరోజు న్యూ గోవా మనోహర్ విమానాశ్రయానికి డైలీ విమాన సర్వీసు ప్రారంభించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 11, 2022న మోపాలోని న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ప్రయాణికులు దిగిన వెంటనే విమానాశ్రయం డిజైన్, సౌందర్యం వారిని మంత్రముగ్ధులను చేస్తాయి. మోపా వద్ద 2,132 ఎకరాల్లో నిర్మించిన న్యూ గోవా మనోహర్ విమానాశ్రయం ఉత్తర గోవాలోని పెర్నెం తాలూకాలో ఉంది. ఇది అత్యాధునికమైన, 24x7 అంతర్జాతీయ విమానాశ్రయం, వచ్చీపోయే పర్యాటకులకు ఇది అన్ని సేవలు అందిస్తుంది.
ఈ విమాన సర్వీసు ప్రారంభంపై GHIAL CEO ప్రదీప్ పణికర్, “న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మొదటి విమాన సర్వీసును ప్రారంభించడం పట్ల మేం సంతోషిస్తున్నాము. మోపా విమానాశ్రయం ప్రారంభంతో పర్యాటకులకు అన్ని రకాలుగా సంతోషకరమైన ప్రయాణ అనుభూతి కలుగుతుంది. 24x7 విమాన సేవలతో, మోపా విమానాశ్రయం, పర్యాటకాన్ని గొప్పగా ఆకర్షిస్తుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుంది. హైదరాబాద్ నుండి గోవాకు ప్రయాణించే పర్యాటకుల సంఖ్య చాలా గణనీయంగా ఉంది, న్యూ గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.’’’ అన్నారు.
ప్రకృతి యొక్క నిర్మలమైన ఒడితో పాటు పర్యాటకులు కోరుకునేవన్నీ గోవా రాష్ట్రం అందిస్తుంది. ఇది భారతదేశంలోని విమానయాన సంస్థలకు చాలా రాబడినిచ్చే మార్కెట్‌లలో ఒకటి. వాటిలో కీలకమైనది విశ్రాంతి మరియు సంపూర్ణ పర్యాటకం. తెల్లటి ఇసుక బీచ్‌లు, ప్రశాంతమైన ప్రార్థనా స్థలాలు, ప్రపంచ వారసత్వ-లిస్టెడ్ ఆర్కిటెక్చర్, గోవా నైట్ లైఫ్, కార్నివాల్‌లు, క్యాసినోలు పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వృక్షజాలం, జంతుజాలంతో సమృద్ధిగా ఉన్న గోవా ప్రపంచంలోని అరుదైన జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో ఒకటి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఇది ఒక సరైన పర్యాటక ప్రదేశం.
త్వరలో ఆకాస ఎయిర్ కూడా న్యూ గోవా మనోహర్ ఎయిర్ పోర్టుకు త్వరలో డైలీ విమాన సర్వీసును ప్రారంభించనుంది.


తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







