దసరా బరిలో బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైన రామ్, రవితేజ.!
- March 31, 2023
దసరాకి రాబోయే సినిమాల విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికైతే రెండు పెద్ద సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయ్.
సంక్రాంతి తర్వాత, సినిమాలకు పెద్ద సీజన్‌గా దసరా సీజన్ చెబుతారు. ఈ సీజన్ బాక్సాఫీస్ పోరుకి ఈ సారి మాస్ రాజా రవితేజ, రామ్ పోతినేని తలపడబోతున్నారు.
అక్టోబర్ 21న ఈ రెండు సినిమాలూ రిలీజ్ కానున్నాయ్. రెండూ ప్రతిష్టాత్మకమైన చిత్రాలే. బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఒకటి కాగా, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోన్న చిత్రం (టైగర్ నాగేశ్వరరావు) ఇంకోటి.
ఈ రెండూ ఒకే రోజున బాక్సాఫీస్ వద్ద పోరుకు తలపడనుండగా, తాజాగా బాలయ్య సినిమా కూడా లైన్లోకి వచ్చింది. ‘విజయ దశమికి ఆయుధ పూజ’ అంటూ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు బాలయ్య 108వ సినిమాకి. రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు కానీ, దసరాకి బరిలోకి దిగుతున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. చూడాలి మరి, ఇన్ని సినిమాల్లో ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడతాయో.? ఏవి తలపడలేక వెనక్కి తగ్గుతాయో.?
తాజా వార్తలు
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్
- స్లీపర్ బస్సులో.. మంటలు ముగ్గురు మృతి,పలువురికి గాయాలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం







