మే లో 2.8%కి పెరిగిన సౌదీ ద్రవ్యోల్బణం
- June 16, 2023
రియాద్: సౌదీ అరేబియాలో 2022లో అదే నెలతో పోలిస్తే వినియోగదారుల ధరల సూచిక (CPI) మే 2023లో 2.8%కి పెరిగింది. ఏప్రిల్ 2023లో అంచనా వేసిన 2.7% పెరుగుదల కంటే ఎక్కువగా ఉందని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్(GASTAT) తెలిపింది. హౌసింగ్, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల ధరలు 8.4% పెరగగా.. ఆహారం, పానీయాల ధరలు 0.9% పెరిగాయి. మే 2022తో పోలిస్తే మే 2023లో ద్రవ్యోల్బణానికి అద్దె ధరలే ప్రధాన కారణమని GASTAT పేర్కొంది.
మే 2023 కోసం అథారిటీ జారీ చేసిన వినియోగదారుల ధరల సూచిక నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియాలో గృహాల వాస్తవ అద్దెలు 9.9% పెరిగాయి. అపార్ట్మెంట్ల అద్దెలు 23.7% పెరిగాయి. అంతేకాకుండా ఆహారం, పానీయాల ధరలు 0.9% పెరుగుదలను నమోదు చేశాయి. మాంసం, పౌల్ట్రీ ధరల పెరుగుదల 2.4%గా ఉంది. గుడ్లు సహా పాలు, పాల ఉత్పత్తుల ధరలు 8.5% పెరిగాయి.
ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫీజులలో 4.5% పెరుగుదల ఫలితంగా విద్యా విభాగం 3.0% పెరుగుదలను నమోదు చేసింది. టూరిస్ట్ ట్రిప్స్ (సెలవు ప్యాకేజీలు) ధరలలో 14.1% పెరుగుదల కారణంగా వినోదం, సంస్కృతి రంగం 3.8% పెరుగుదలను నమోదు చేసింది. రెడీమేడ్ గార్మెంట్స్ ధరలు 3.3% తగ్గడం వల్ల బట్టలు, బూట్ల ధరలు 2.2% తగ్గాయని GASTAT వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







