అఖిల్ ‘ఏజెంట్’కి ఏమైంది.? ఓటీటీలో కూడా.!
- June 28, 2023
పెద్ద తెరపై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అఖిల్ ‘ఏజెంట్’. పోనీ ఓటీటీలోనైనా వస్తుందేమో అనుకుంటే, ఇదిగో వస్తోంది.. అదిగో వస్తోంది.. అంటున్నారు కానీ, డేట్ ఫిక్స్ చేసుకోవడం లేదు.
జూన్‌లోనే ‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ అన్నారు. ఓటీటీ రిలీజ్ కోసం మార్పులు చేర్పులు కూడా జరిగాయన్నారు. ఆల్రెడీ ఓ డేట్ ఫిక్స్ చేసి కూడా ఎస్కేప్ అయ్యారు.
ఏజెంట్ విషయంలో అసలేం జరుగుతోంది.? సోనీ లివ్ ‘ఏజెంట్’ హక్కుల్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఛానెల్ ఒత్తిడి వల్లనే మార్పులు చేశారట. అయినా కానీ, ఇంతవరకూ ఏజెంట్ సినిమా ఊసే లేదు ఓటీటీలో.
ఇక, ఈ సంగతి అటుంచితే, అఖిల్ తదుపరి చిత్రంపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయ్. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చయబోతున్నాడన్న తాజా గాసిప్ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా వినిపిస్తోంది.
అఖిల్‌ని తొలిసారిగా తెరపై చూపించిన ఘనత విక్రమ్ కుమార్‌దే. ‘మనం’ సినిమా ద్వారా అఖిల్‌ని విక్రమ్ కుమార్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీకీ, ఎలివేషన్‌కి మంచి రెస్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!
- కువైట్ బేలో ముల్లెట్ ఫిషింగ్ పై నిషేధం ఎత్తివేత..!!
- గాజాలో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలను స్వాగతించిన ఒమన్..!!
- సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- రియాద్ లో బ్రిడ్జి పైనుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!