‘ప్రాజెక్ట్ కె’ అప్డేట్.! దీపికా పదుకొనె ఫస్ట్ లుక్‌పై మిక్స్డ్ రెస్పాన్స్.!
- July 18, 2023ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ నుంచి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ లుక్స్‌లో దీపికా సీరియస్‌గా కనిపిస్తోంది.
ఫేస్ ఒక్కటే వైడ్ యాంగిల్లో చూపించడం వల్ల దీపిక పాత్ర గురించి కూడా ఎలాంటి అభిప్రాయం రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
ప్రాజెక్ట్ కె కోసం జనం చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. ఇంతవరకూ ప్రబాస్ చేసిన ప్యాన్ ఇండియా సినిమాలన్నీ ఓ ఎత్తు. ఈ సినిమా ఒక్కటీ ఇంకో ఎత్తు.. అనేంతలా ‘ప్రాజెక్ట్ కె’ని సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సినిమా మొదటి ప్రచార చిత్రాన్నీ, టైటిల్‌నీ ప్రఖాత్య కామిక్ కాన్ వేదికపై అమెరికాలో జూలై 20న రిలీజ్ చేయనున్నారు.
ఈ వేదికపై రిలీజ్ అవుతున్న తొలి భారతీయ ప్రచార చిత్రంగా ప్రాజెక్ట్ కె హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. జూలై 21న ఇండియాలో ఈ ప్రచార చిత్రం రిలీజ్ చేయనున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులు కూడా భాగం కావడం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..