హరీష్‌తో మాస్ రాజా మజా ఇంకోస్సారి.!
- July 18, 2023
‘షాక్’ సినిమాతో హరీష్ శంకర్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో రవితేజ హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘మిరపకాయ్’ ‘నేనింతే’ సినిమాలు రవితేజతోనే తెరకెక్కించాడు హరీష్ శంకర్. అలా హరీష్ శంకర్‌కీ, రవితేజకీ మంచి అనుబంధం వుంది.
త్వరలోనే హరీష్ శంకర్, రవితేజ కాంబో మళ్లీ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఓ హిందీ రీమేక్‌ని రవితేజ కోసం హరీష్ శంకర్ సిద్ధం చేశాడట. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘రైడ్’ మూవీని తెలుగులో రవితేజ కోసం మార్పులు చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశాడట.
ఈ రీమేక్‌లో నటించేందుకు రవితేజ కూడా సిద్ధంగా వున్నాడట. ప్రస్తుతం హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా వున్నాడు. అలాగే, ‘టైగర్ నాగేశ్వరరావు’ సహా మరో రెండు ప్రాజెక్టులతో రవితేజ బిజీగా వున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదికెళ్తుందన్న దానిపై పక్కా క్లారిటీ లేదు కానీ, ఈ ఏడాది చివర్లో ఓ అప్డేట్ రాబోతోందనీ ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!