ఒమన్ లో పర్యటిస్తున్నభారత నావికాదళ అధిపతి

- August 01, 2023 , by Maagulf
ఒమన్ లో పర్యటిస్తున్నభారత నావికాదళ అధిపతి

మస్కట్: ప్రస్తుతం ఉన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు,  ఒమన్ సైనిక నాయకత్వంతో ఉన్నత స్థాయి చర్చల కోసం భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మూడు రోజుల ఒమన్ పర్యటనకు వచ్చారు. తన పర్యటనలో నావల్ స్టాఫ్ చీఫ్, రాజ కార్యాలయ మంత్రి జనరల్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్-నుమానీని కలిశారు. ఒమన్ రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసర్ బిన్ మొహసేన్ అల్-రహ్బీ మరియు ఒమన్ రాయల్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ మటర్ బిన్ సలీం బిన్ రషీద్ అల్ బలూషితో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.ఈ మేరకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అతను ఒమన్‌లోని కీలక రక్షణ, శిక్షణా సంస్థాపనలను కూడా సందర్శించనున్నారు.

అంతకుముందు ఆదివారం మస్కట్ చేరుకున్న నేవల్ చీఫ్ కు ఒమన్ రాయల్ నేవీ కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసిర్ బిన్ మొహ్సిన్ అల్-రహ్బీ ,  ఒమన్‌లోని భారత రాయబారి అమిత్ నారంగ్ స్వాగతం పలికారు. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ సందర్శన సందర్భంగా స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ INS విశాఖపట్నం మస్కట్‌లోని పోర్ట్ సుల్తాన్ ఖబూస్ వద్దకు చేరుకుంది. ఒమన్ రాయల్ నేవీతో వివిధ నావికా సహకార కార్యక్రమాలు ఆగస్ట్ 3న ముగియనున్న మారిటైమ్ పార్టనర్‌షిప్ ఎక్సర్ సైజులో ఇది పాల్గొంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com