గవర్నర్ తమిళిసై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

- September 26, 2023 , by Maagulf
గవర్నర్ తమిళిసై సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి తమిళిసై విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై కవిత మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాననే విషయం తమిళిసై గుర్తుంచుకోవాలని చెప్పారు. బిజెపి బీసీ వ్యతిరేక పార్టీ అని, ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు.

నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈమేరకు కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపించింది. అయితే, సర్వీస్ కేటగిరీ కింద రాజకీయ నాయకుల పేర్లను ప్రతిపాదించారంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. వారిద్దరూ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారని, అలాంటి వారిని సేవారంగం కోటా కింద ప్రతిపాదించడం సరికాదని అన్నారు. తగిన అర్హతలు లేని కారణంగా కేబినెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com