సౌదీ-కారికోమ్ సమ్మిట్‌ను ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్

- November 17, 2023 , by Maagulf
సౌదీ-కారికోమ్ సమ్మిట్‌ను ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్

రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ తరపున, క్రౌన్ ప్రిన్స్ - ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ గురువారం రియాద్‌లో 1వ సౌదీ – కారికోమ్(CARICOM) సమ్మిట్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఇందులో క్రౌన్ ప్రిన్స్,  డొమినికన్ ప్రధాన మంత్రి, కారికోమ్ ఛైర్మన్ రూజ్‌వెల్ట్ స్కెరిట్ సహ-అధ్యక్షుడు, 15 కారికోమ్ సభ్య దేశాల దేశాధినేతలు, అధ్యక్షులు, ఉన్నత స్థాయి అధికారులు ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు. పెట్టుబడులు, వాణిజ్యం, ప్రాథమిక ప్రాజెక్టులు, ఆతిథ్యం, వాతావరణ మార్పు, ఇంధనం మరియు పర్యావరణ సుస్థిరత వంటి పరస్పర సమస్యలపై ఈ సదస్సు చర్చిస్తోంది. CARICOM (కరేబియన్ కమ్యూనిటీ అండ్ కామన్ మార్కెట్) అనేది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థజ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం అంతటా 15 సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక యూనియన్.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com