చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది..
- June 07, 2016
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8.30గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తొలుత ప్రకటించినప్పుటికీ అర్థగంట ముందే పంపిణీ ప్రారంభించారు. 32 కేంద్రాల ద్వారా చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మధ్యాహ్నం తర్వాత రావాలని పోలీసుశాఖ విజ్ఞప్తి చేసింది. చేప ప్రసాదం పంపిణీలో 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8.30గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానంలో చేపప్రసాదం పంపిణీ చేయనున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారికి దాతలు భోజనం, నీటి వసతి ఏర్పాటు చేశారు.
ఎగ్జిబిషన్ మైదానంలోకి బయటి వాహనాలకు అనుమతి నిరాకరించారు. మైదానం వద్ద ఇవాళ, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







