నాని ‘సరిపోదా శనివారం’.! అక్కడి వాళ్ల కోసం.!
- July 03, 2024
నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ‘సరిపోదా శనివారం’. టైటిల్‌తో పాటూ ఈ సినిమా గ్లింప్స్కీ మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమాగా ఈ సినిమా ప్రొజెక్ట్ అవుతోంది.
కాగా, ఈ సినిమాని కేవలం తెలుగులోనే కాదండోయ్ ఏకంగా ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. అయితే, మిగిలిన భాషల్లో ఈ సినిమాకి టైటిల్ మార్చేశారు. తాజాగా ఆ విషయాన్ని రివీల్ చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో నాని ‘సూర్య’ పాత్రలో కనిపించబోతున్నాడు. సో, ఆయన పాత్ర పేరు మీదుగా టైటిల్‌ని ‘సూర్య శనివారం’గా మార్చారు మిగిలిన భాషల్లో. ఈ సూర్య క్యారెక్టర్ని ఏదో చిత్రంగా డిజైన్ చేసినట్లు గ్లింప్స్‌లో చూపించారు.
అలాగే, సినిమాలో యాక్షన్ బ్లాక్స్ కూడా డిఫరెంట్‌గా కట్ చేసినట్లు తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ సినిమాలంటే కూల్ అండ్ లవ్లీగా వుంటుంటాయ్. అలాంటిది ‘సరిపోదా శనివారం’ సినిమాని యాక్షన్ ఓరియెంటెడ్‌లో సీరియస్ మోడ్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే కాంబినేషన్లో వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమాని కంప్లీట్ హ్యూమరస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, బ్యాడ్ లక్ అంచనాల్ని అందుకోలేదీ సినిమా.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!