సూడాన్ లో కుప్ప‌కూలిన విమానం…10 మంది మృతి

- February 26, 2025 , by Maagulf
సూడాన్ లో కుప్ప‌కూలిన విమానం…10 మంది మృతి

సూడాన్: దక్షిణ సూడాన్‌లో మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది.ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్‌వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వారిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ప్ర‌మాద సమ‌యంలో విమానంలో 20 మంది ఉన్నారు.. ఈ ప్ర‌మాదంలో పలువురికి గాయాలయ్యాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు. ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com