SLBC సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలు పరిశీలించిన సీఎం రేవంత్‌

- March 02, 2025 , by Maagulf
SLBC సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలు పరిశీలించిన సీఎం రేవంత్‌

తెలంగాణ: శ్రీ శైలం ఎడమ గట్టు కాలువ (SLBC)లో కార్మికులు చిక్కుకుపోయిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్న వేళ అక్కడకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు వెళ్లారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఘటనపై అధికారులతో రివ్యూ మీటింగ్ లోనూ వారు పాల్గొన్నారు.ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలోకి స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు.

ఎంత రిస్క్ అయినా సరే ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి, ఆపరేషన్‌ను ముందుకు తీసుకుపోవాలని అన్నారు.

మిగతా టన్నెల్ కంటే ఇది పూర్తి భిన్నమైన టన్నెల్ అని చెప్పారు. వెంటనే చేయవలసిన పనులపై నివేదిక ఇవ్వాలని అన్నారు. అధికారులతో సహాయక చర్యలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సీఎం, మంత్రులకు సహాయక చర్యల బృందం వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com