‘GAIL’లో జాబ్స్

- March 05, 2025 , by Maagulf
‘GAIL’లో జాబ్స్

గెయిల్ జాబ్స్ పడ్డాయి.. ఆసక్తిగల అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.గేట్ స్కోరు ఉన్నవారే అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అయినవారికి నెలకు రూ.లక్షా 80వేల వరకు జీతం వస్తుంది. న్యూఢిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (GAIL) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 73 ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ జాబ్స్ ప్రకటించింది.అయితే,ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్‌-2025 స్కోరు ఉండాలి.ఈ గేట్ స్కోరు ఆధారంగానే ఆయా పోస్టుల్లో ఖాళీలకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల్లో అనేక విభాగాలు ఉన్నాయి. కెమికల్‌‌లో 21 ఖాళీలు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 17 ఖాళీలు, ఎలక్ట్రికల్‌ విభాగంలో14 ఖాళీలు, మెకానికల్‌ విభాగంలో 8 ఖాళీలు, బీఐఎస్‌‌లో 13 ఖాళీలు ఉన్నాయి.

గెయిల్ అర్హతలివే:
గెయిల్ పోస్టుల కోసం అప్లయ్ చేసే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్‌ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌‌లో 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే గేట్‌-2025 స్కోరు కూడా తప్పనిసరి. అందులోనూ ఫుల్‌టైమ్‌ రెగ్యులర్‌ కోర్సు మాత్రమే చేసి ఉండాలి. ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ చేసినవారు కూడా అర్హులే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com