గేయ కధా ప్రక్రియకు బాట వేసిన నారాయణ రెడ్డి

- March 16, 2025 , by Maagulf
గేయ కధా ప్రక్రియకు బాట వేసిన నారాయణ రెడ్డి

హైదరాబాద్: సినీ పాటలు రాసిన వారు ఎందరో  ఉన్నారు కానీ తెలుగు సారస్వతం లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న  కొద్ది మంది సినీ గీత రచయిత లలో సి నారాయణ రెడ్డి  ప్రముఖులు అని ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం అన్నారు గేయ కధా ప్రక్రియకు బాట వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సినారె సాహిత్యం విశ్వజనీనం అన్నారు భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం తో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వంశీ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వహణ లో విఖ్యాత కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి తొలి సినీ గీత రచన చేసి 65 సంవత్సరాలు పూర్తి ఇన సందర్భం గా సినారె పాటకు పట్టాభిషేకం పేరిట అయన రచించిన పాటలు ప్రముఖ గాయకులు మిత్ర,గీతాంజలి,కృష్ణ ప్రసాద్, ఇందు నయన, మాస్టర్ విజయ్ మధురం గా ఆలపించారు మాస్టర్  విజయ్ పాడిన కంటే నే అమ్మ అని అంటే ఎలా ను హృద్యం గా పాడారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వోలేటి పార్వతీశం మాట్లాడుతూ సినారె రచనా వ్యాసంగం అరభించినతరుణం లో మహా మహులు విశ్వనాధ సత్యనారాయణ రాయప్రోలు సుబ్బారావు దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి వారు వున్నారని అన్నారు వారిలో తన ప్రత్యేకత నిలుపుకొనేందుకు నాగార్జున సాగరం కర్పూర వసంత రాయలు వంటి గేయ కథా కావ్యాలు రాశారు అని వివ రించారు. ప్రముఖ రచయిత్రి జలంధర చంద్ర మోహన్ మాట్లాడుతూ తన భర్త చంద్ర మోహన్ సినిమాల లోని పలు పాటలు విమర్శ సినారె రాసినవి హిట్ అయ్యాయని చెప్పేరు వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు మాట్లాడుతూ సినరే కార్యక్రమలకు అయన కుమార్తెలు రావటం సంతోషం అన్నారు డాక్టర్ తెన్నేటి సుధ, సుంకర పల్లి శైలజ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా సుధామయి సందర్భోచిత వ్యాఖ్యానం చేశారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com